LIC Offers : తక్కువ వడ్డీకే లోన్ .. ఎల్ఐసీ బంపర్ ఆఫర్

ఈఎంఐలు, ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా నచ్చినప్పుడు లోన్ చెల్లించవచ్చు. ఆ సౌకర్యాన్ని ప్రభుత్వ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) కల్పిస్తోంది. మీకు ఎల్ఐసీ పాలసీ ఉంటే దానిపై ఈజీగా లోన్ పొందవచ్చు. ఇలా పాలసీపై తీసుకున్న రుణాలకు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం ఉండదు. వడ్డీ సైతం చాలా తక్కువగా ఉంటుంది. మీ వద్ద డబ్బులు ఉన్నప్పుడే తిరిగి చెల్లించవచ్చు. ఎప్పటి వరకు అంటే మీ పాలసీ టెన్యూర్ ఉన్నంత వరకు మీరు ఎప్పుడైనా తిరిగి కట్టవచ్చు. వడ్డీ సైతం ఏడాదికి ఓసారి లెక్కిస్తారు. ఎల్ఐసీ పాలసీపైన తీసుకునే రుణాలు సెక్యూర్డ్ లోన్స్ పరిధిలోకి వస్తాయి. అందుకే వీటిపై వడ్డీ అనేది తక్కువగా ఉంటుంది. 3-5 రోజుల్లోనే మీకు లోన్ మంజూరువుతుంది. అయితే, లోన్ తీసుకుంటే పాలసీ ప్రభావితమవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పాలసీ ప్రయోజనాలు అలాగే కొనసాగుతాయి. అంతేకాదు..ఈ రుణ మంజూరు కోసం ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు వసూలు చేయరు. ఈ రుణ కాల వ్యవధి 6 నెలల నుంచి మీ పాలసీ మెచ్యూర్ అయ్యే వరకు ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com