MahaKumbha Mela: మధుర యాత్రికుడు మంటల్లో కాలి బూడిద.. ప్రమాదం నుంచి తప్పించుకున్న 49 మంది

ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు ప్రతి రోజు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
మథురలోని బృందావనం వద్ద కుంభమేళాకు వస్తున్న యాత్రికుల బస్సులో మంటలు చెలరేగడంతో 49 మంది యాత్రికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక యాత్రికుడు సజీవ దహనమయ్యాడు.
తెలంగాణ రాష్ట్రం కుభీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన శీలం ద్రుపత్ (60) దగ్ధమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ద్రుపత్ పొగ తాగడమే అగ్నిప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. స్థానిక అగ్నిమాపక యంత్రాలు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి.
ముధోలే ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ మధుర కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడి యాత్రికులను వీలైనంత త్వరగా తరలించేందుకు అధికారయంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాద బాధితులకు ఆహారం, వసతి సదుపాయం కల్పించామని తెలిపారు ,అగ్ని ప్రమాదంలో యాత్రికుల వస్తువులు కూడా దగ్ధమైనట్లు ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com