Mohan Babu : రేయ్ మనోజ్.. పరువు తీశావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్

Mohan Babu : రేయ్ మనోజ్.. పరువు తీశావ్.. మోహన్ బాబు ఆడియో వైరల్
X

తండ్రీ కొడుకుల ఆస్తి పంచాయతీ బజారుపాలైంది. జల్ పల్లి ఫాంహౌజ్ లో మనోజ్ తన భార్య బౌన్సర్లతో గేట్లు బద్దలుకొట్టుకుని లోపలికి వెళ్లడం తీవ్ర దుమారానికి కారణమైంది. కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు చేయిచేసుకున్నారు. దీంతో.. మోహన్ బాబు మరింతగా అపనిందలపాలయ్యారు. ఆ తర్వాత మనోజ్‌ను ఉద్దేశించి మోహన్‌బాబు ఆడియో రిలీజ్ చేశారు. నిన్ను అల్లారుముద్దగా పెంచాను.. భార్య మాటలు విని గుండెలపై తన్నావంటూ మోహన్‌బాబు ఆడియో విడుదల చేశారు. తన కష్టార్జితంతో కట్టుకున్న ఇంటిలోకి అడుగుపెట్టడానికి అధికారం లేదన్నారు. ఆస్తులు సమానంగా రాయాలా వద్దా అన్నది తన ఇష్టమన్నాడు. పోలీసుల సమక్షంలోనే నీ కూతురిని అప్పగిస్తానంటూ ఆడియోలో మోహన్‌బాబు తెలిపారు.

Tags

Next Story