Telecom Tariffs : యూజర్లకు మొబల్ కంపెనీల షాక్.. భారీగా పెరగనున్న

Telecom Tariffs : యూజర్లకు మొబల్ కంపెనీల షాక్.. భారీగా పెరగనున్న
X

యూజర్లకు మొబైల్ కంపెనీలు షాక్ ఇవ్వనున్నాయి. గతేడాదిలో రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలను భారీగా పెంచిన మొబైల్ నెట్‌వర్క్‌ కంపెనీలు మరోసారి పెంపునకు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది చివరికి మొబైల్‌ టారిఫ్‌లను 10-12 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు పెరగడం, 5జీ సదుపాయాల నేపథ్యంలో ఈ పెంపు ఉండొచ్చని అంటున్నారు.

రెండు నెలల క్రితం దేశంలో మొబైల్‌ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఒక్క మే నెలలోనే 74 లక్షల మంది కొత్తగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నారు. దీంతో మొత్తం యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 108 కోట్లకు చేరింది. ఆ నెలలో రిలయన్స్‌ జియోలో కొత్తగా 55 లక్షల మంది చేరగా.. ఎయిర్‌టెల్‌‌కు 13 లక్షల మంది కొత్త యూజర్లు వచ్చారు. యూజర్ల సంఖ్య పెరగడంతో టారిఫ్‌ల పెంపుపై టెలికాం సంస్థలు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. గతేడాది లాగే ఈ ఏడాది కూడా ఈ ఏడాది చివరికి మరో 10-12శాతం పెంచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈసారి బేస్‌ ప్లాన్ల జోలికిపోకపోవచ్చని తెలుస్తోంది. టాప్ ప్లాన్లలపై ఛార్జీలు పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి.

కొత్త రీఛార్జ్‌ ప్లాన్స్ కు సంబంధించి డేటా తగ్గించే అవకాశాలున్నాయి. డేటా ప్యాక్‌లను ప్రత్యేకంగా ప్లాన్స్ తీసుకొచ్చే ఆలోచనలు చేస్తున్నట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మొబైల్‌ టారిఫ్‌లలో మార్పులు అవసరమని ఇప్పటికే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్స్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags

Next Story