Mock Drills : హైదరాబాద్, వైజాగ్ లో మాల్.. ఏర్పాట్లు షురూ!

ఇండియా, పాక్ ఉద్రిక్తతల నడుమ సివిల్టిఫెన్స్ కేంద్ర ప్రభుత్వం రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేస్తుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాల హోం కార్యదర్శులతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్, విశాఖపట్టణgలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు నగరాలను కేటగిరి కింద కేంద్రం చేర్చింది. ఇవాల్టి వీడియో కాన్ఫరెన్స్కు రాష్ట్రం నుంచి హోం సెక్రటరీతో పాటు డీజీపీ, ఫైడ్ డీజీ హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ నిర్వహించాలో సూచించిన కేంద్రం... జమ్మూకశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించిం ది. మొత్తం మీద దేశవ్యాప్తంగా రేపు 259 చోట్ల వీటిని నిర్వహిస్తారు. కేంద్ర ఆదేశాలకు అనుగు ణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు మాకు డ్రిల్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇవాళ శ్రీనగర్ లోని దాల్ సరసు సమీపంలో వైమానికి దాడి సైరన్ పరీక్ష నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com