Mouni Amavasya : మౌని అమావాస్య.. ఇవాళ ఇలా చేస్తే..

పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా పుణ్య నదుల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. నదికి వెళ్లలేని వారు బావి వద్ద స్నానం చేయాలి. గంగామాతను పూజించి హారతి ఇవ్వాలి. శివాలయాలకు వెళ్లి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయాలి. అవకాశం ఉంటే మౌన వ్రతం పాటించాలి. సామర్థ్యం మేరకు దానం చేయాలి.
ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. మౌని అమావాస్య రోజున వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో తెల్లని పువ్వులతో వేయడం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయి. మౌని అమావాస్య రోజున కుంకుమపువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణ ముఖంగా ఉండే శంఖంలో వేయాలి. అనంతరం నేతి దీపం వెలిగించి, కమలగట్ట మాలతో ఓం శ్రీ అనే మహాలక్ష్మీ మంత్రాన్ని 11సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే కొన్ని పొరపాట్ల చేయడం వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు కొన్నిటిని పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రం నుంచి కూడా బయటపడడానికి అవుతుంది. పుష్య మాసంలో కృష్ణపక్ష అమావాస్యని చొల్లంగి అమావాస్య లేదంటే మౌని అమావాస్య అని పిలుస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com