Karnataka Government : సినిమా టికెట్ రూ.200 .. కర్ణాటక సర్కారు నిర్ణయం

సినిమా టికెట్ ధరను రూ. 200 గా నిర్ణయించింది కర్నాటక సర్కారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినిమా ప్రమోషన్స్, మహిళా సాధికారికత వంటి అంశాల గురించి ఈసారి బడ్జెట్ లో కీలకంగా ప్రస్తావించారు. సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోసం సినిమా టికెట్ ధరలను రూ.200గా నిర్ణయించాలను కుంటున్నట్లు చెప్పారు. మల్టీప్లెక్స్ లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని స్పష్టం చేశారు. సామా న్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్ ఫాము సైతం అం దుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్లో ఒక ఫిల్మ్ సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రూ.500 కోట్ల బడ్జె్ట్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com