Whatsapp : వాట్సప్ లో కొత్త ఫీచర్లు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ రెండు సరికొత్త ఫీచర్లు తీసుకురావాలని చూస్తోంది. ఈ వివరాలను వాబీటా ఇన్ఫో తన బ్లాగ్ పోస్ట్ లో వెల్లడించింది. మొబైల్ నెంబర్ను సేవ్ చేయకపోయినా.. అవతలి వ్యక్తికి మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చిన వాట్సప్.. కాంటాక్ట్ సేవ్ చేయడంలో కొత్త ఫీచర్లను పరిచ యం చేయనుంది. లింక్డ్ డివైజెస్ లోనే కాంటాక్ట్ని సేవ్ చేసేలా తన ప్లాట్ఫామ్న రూపుమార్చనుంది. ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్నా, మొబైల్ని మార్చినా వాట్సప్ లోని కాంటాక్టు అలాగే ఉంటాయి. త్వరలోనే ఈ ఫీచర్ వాట్సప్ వెబ్, విండోస్ యూజర్లకు అందుబాటులోకి వాట్సప్ లోని మెటా ఏఐ పర్సనల్ అసిస్టెంట్గా ఉపయోగపడుతోంది. సందేహాలకు సమాధానాలిస్తూ చాలా విషయాల్లో చేదోడుగా నిలుస్తోంది. దీనికి కొత్తగా చాట్ మెమొరీ పీచర్ జత కానుంది. మెటాకు మనం అందించే సమాచారాన్ని రికార్డు చేసి మెరుగైన పర్సనల్ అసిస్టెంట్ గా మారుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com