Nobel Prize : భౌతికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి

X
By - Manikanta |8 Oct 2024 11:15 PM IST
భౌతిక శాస్త్రంలో అమెరికాకు చెందిన జాన్ జే హోప్ ఫీల్డ్, యూకేకు చెందిన జెర్రీ హింటన్ అనే శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు గానూ ఈ అత్యున్నత పురస్కారం వర్తించింది. స్టాన్హాంలో ఉన్న కరోల్స్ ఇన్స్టిట్యూట్ ని నోబెల్ బృందం ఈ పుర స్కారాలను ప్రకటించింది. గతేడాది (2023) భౌతికశాస్త్రంలో ఈ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. మరోవైపు సోమవారం వైద్యశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారాలను ప్రకటించగా.. మంగళవారం భౌతికశాస్త్రంలో ప్రకటించారు. బుధవారం రసాయన శాస్త్రం, ఎల్లుండి సాహిత్యం, ఈ నెల 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com