Kohli Pub : విరాట్ కోహ్లీ పబ్‌కు నోటీసులు

Kohli Pub : విరాట్ కోహ్లీ పబ్‌కు నోటీసులు
X

బెంగళూరులోని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన ‘వన్8 కమ్యూన్’ పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. క్లబ్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించనందుకే BBMP (బెంగళూరు బృహత్ మహానగర పాలికే) సమన్లు జారీ చేసింది. ఈ పబ్ చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉన్న రత్నం కాంప్లెక్స్‌లోని ఆరో ఫ్లోర్‌లో ఉంది. దీనిపై గత నెల 29న సామాజిక కార్యకర్త హెచ్.ఎమ్ వెంకటేశ్ ఫిర్యాదు చేయగా నోటీసులు పంపింది.

బెంగళూరులో చాలా ఎత్తయిన భవనాలలో ఎన్నో రెస్టారెంట్లు, బార్లు, పబ్ లు ఎటువంటి అగ్నిమాపక భద్రతా చర్యలు లేకుండా పనిచేస్తున్నాయని సోషల్ వర్కర్ వెంకటేష్ తెలిపారు. ఇలాంటి ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరిగితే భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గతంలోనూ ఈ పబ్ పై ఓ కేసు నమోదయింది.

అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కూడా ఈ పబ్ ని నిర్వహిస్తున్నందుకు ఈ ఏడాది జూలైలో ఈ పబ్ పై ఎఫ్ఐఆర్ నమోదయింది. జులై 7 న పక్కా సమాచారంతో పిఎస్ఐ అశోక్ ఠాకూర్ నేతృత్వంలోని పోలీస్ బృందం శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు ఎంజీ రోడ్డు సమీపంలోని కస్తూర్బా రోడ్డులోని రత్నం కాంప్లెక్స్ భవనం వద్ద ఉన్న (వన్ 8) కమ్యూన్ పబ్ పై దాడి చేశారు

Tags

Next Story