Delhi : భార్య వేధింపులు.. భర్త సూసైడ్.. మృతుడు ప్రముఖ కేఫ్ యజమాని

Delhi : భార్య వేధింపులు.. భర్త సూసైడ్.. మృతుడు ప్రముఖ కేఫ్ యజమాని
X

భార్య వేధింపులకు మరో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలో భార్య వేధింపులతో ఉరి వేసుకొని ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీ - కళ్యాణ్ విహార్‌ ప్రాంతానికి చెందిన పునీత్ ఖురానా, అతని భార్య మానికా జగదీశ్ పహ్వా ఇద్దరు కలిసి ఉడ్‌బాక్స్ కేఫ్ అనే బేకరి పెట్టారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరగడంతో విడాకులు తీసుకోగా... ఆ కేసు కోర్టులో నడుస్తుంది. అయితే పునీత్‌ను అతని భార్య మానికా ఫోన్ చేసి గత కొద్ది రోజులుగా వేదింపులకు గురిచేస్తుంది. దీంతో తన ఇంట్లో పునీత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. పునీత్ ఫోన్‌లో తన భార్యతో మాట్లాడిన 16 నిమిషాల కాల్ రికార్డ్‌ను పోలీసులు గుర్తించారు. ఇప్పుడు పుతీన్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతుల్ సుభాశ్ ఆత్మహత్య తరహాలో.. భార్య వేధింపులకు మరో ఆత్మహత్య అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతున్నాయి.

Tags

Next Story