Motorola Razr 60 Launched : మోటోరోలా నుంచి రేజర్ 60 రిలీజ్

భారత మార్కెట్లోకి మోటోరోలా కంపెనీ మరో ఫీచర్ ఫోన్ ను రిలీజ్ చేసింది. రూ.50 వేల బడ్జెట్తో రేజర్ 60 మోడల్ను విడుదల చేసింది. ఫీచర్ల విష యానికొస్తే, 6. 9 అంగుళాల ఫుల్ హెల్డీ ప్లస్ ఎల్టీటీపీవో డిస్ప్లే 120 హెట్జ్ రిఫ్రెష్ రేటు, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఆకట్టుకునేలా ఉంది. ఔటర్ డిస్ప్లే 3.63 అంగుళాల పోల్డీ డిస్ప్లే కలిగివుంది. కార్నింగ్ గొరిల్లా సిరామిక్ ప్రొటెక్షన్తో దీనిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మీడియాటెట్ డైమెన్సిటీ 7400 ఎక్స్ ప్రాసెసరు కలిగివుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత హల్లోయూఐతో పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీ మెయిన్ కెమేరా, 13 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్ ఉన్నా యి. సెల్ఫీకోసం ప్రత్యేకంగా 32 ఎంపీ కమేరా ఇచ్చారు. ఐపీ 48 రేటింగ్, ఏఐ ఇమేజింగ్ టూల్స్తో దీన్ని తీర్చి దిద్దారు. 4700 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి వుంది. 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధరను 49,999 గా నిర్ణయించింది. జూన్ 4 నుంచి విక్రయాలు ప్రారంభి స్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com