Potato and Onion Prices : పెరుగుతున్న ఆలు, ఉల్లి ధరలు.. కారణాలు ఇవే

గత సంవత్సరం బంగాళాదుంపలు, ఉల్లిపాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఇతర కూరగాయల ధర చాలా తక్కువగా ఉంది. బంగాళాదుంప ధర గత ఏడాది కిలో రూ.22 ఉండగా, ఇప్పడు రూ.25 కంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఉల్లిపాయలు కిలో రూ.32 నుండి 36కి పెరిగాయి. రిటైల్ మార్కెట్లలో వీటి ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు టమోటా ధర ఇప్పుడు హోల్సేల్లో కిలో రూ.3కి పడిపోయింది. ఇంత తక్కువ ధరలు ఉండటం వల్ల రైతులు తమ ఖర్చులను కూడా తిరిగి పొందలేని పరిస్థితి నెలకొంది. దీని కారణం గా రైతులు టమోటాలను పొలాల్లోనే వదిలివేస్తున్నారు. అయితే, రిటైల్ మార్కెట్లో ఇప్పటికీ కిలో టమోటా రూ.20-25కి అమ్ముతున్నారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో టమోటా రైతులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఛత్తీస్గఢ్ లోని దుర్గ, జష్పూర్, మహాసముంద్, ముంగేలి, బలోడ్ జిల్లాల్లో టమోటాను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తారు. ఇక్కడ టమోటాలను హోల్సేల్లో రూ.2కి, రిటైల్ లో రూ.5కి అమ్ముతున్నారు. చత్తీస్గఢ్ వ్యాపారవేత్తలు ఇక్కడి నుండి టమోటాలు మహారాష్ట్ర, బెంగాల్, తదితర రాష్ట్రాలకు వెళ్లేవి. కానీ ఈ ఏడాది ఇతర రాష్ట్రాలలో టమోటా ఉత్పత్తి బాగానే ఉందని చెబుతున్నారు. ఇది కాకుండా గతంలో ఛత్తీస్ గఢ్ నుండి టమోటాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇతర పొరుగుదేశాలకు వెళ్లేవి. గత కొన్ని సంవత్సరాలుగా నేపాల్ మినహా ఇతర దేశాలకు సరఫరా ఆగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com