Royal Enfield : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ లాంచ్

Royal Enfield : రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ లాంచ్
X

దేశీయంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఏటా విక్రయాలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు ఈ విభాగంలో బైక్‌లను లాంచ్‌ చేశాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కూడా ఈవీ రంగంలోకి అడుగుపెట్టింది. బైక్‌ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్‌ బైక్‌ను తాజాగా ఆవిష్కరించింది. ఫ్లయింగ్‌ ఫ్లీ సీ6 పేరిట తీసుకొచ్చింది. ఫ్లయింగ్‌ ఫ్లీ సీ6 అనేది రెట్రో- ఫ్యూచరిస్టిక్‌ మోటార్‌ సైకిల్‌. ఇది రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌, ముందువైపు గిర్డర్‌ ఫోర్క్‌లతో రానుంది. ఇందులో ఏబీఎస్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ విద్యుత్‌ బైక్‌లో రెండు సీట్ల వెర్షన్లు కూడా ఉండనున్నట్లు అంచనా. ఇక టీఎఫ్‌టీ డిస్‌ప్లేతో రానుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 100-150 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇకపై మార్కెట్లోకి తీసుకొచ్చే అన్ని విద్యుత్‌ బైక్‌లను ‘ఫ్లయింగ్‌ ఫ్లీ’ పేరిట ఆవిష్కరించనున్నట్లు రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది. లుక్‌ని రివీల్‌ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ పూర్తి ఫీచర్ల వివరాలు, ధర ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఆ వివరాలన్నీ ప్రకటించే అవకాశం ఉంది. 2026లో మార్కెట్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.

Tags

Next Story