Saif Ali Khan : హాస్పిటల్ కు చేర్చిన ఆటోవాలాతో సైఫ్ భేటీ

Saif Ali Khan  : హాస్పిటల్ కు చేర్చిన ఆటోవాలాతో సైఫ్ భేటీ
X

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశారు. వారం రోజుల క్రితం ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలోకి బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి జొరబడ్డాడు. చోరీకి ప్రయత్నించగా సైఫ్ అలీఖాన్ అడ్డుకోవడంతో కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు.సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడిన సమయంలో అతనిని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా ఆసుపత్రికి తరలించాడు. తనను సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి రక్షించినందుకు గాను సైఫ్ అలీఖాన్... ఆటో డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇతరులనూ ఇలాగే ఆదుకోవాలని సూచించారు. సైఫ్ అలీఖాన్ ఆటో డ్రైవర్‍‌ను కలిసిన సమయంలో వెంట తల్లి షర్మిలా ఠాగూర్ ఉన్నారు.

Tags

Next Story