Sankranti Traffic : సంక్రాంతి.. ఇలా ట్రాఫిక్ జామ్ తప్పించుకోండి!

Sankranti Traffic : సంక్రాంతి.. ఇలా ట్రాఫిక్ జామ్ తప్పించుకోండి!
X

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుకి వెళ్లే వారికి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారు. పెద్ద అంబర్ పేట్ నుంచి చౌటుప్పల్ మీదుగా చిట్యాల వరకు వాహనాల రద్దీ ఉందని చెప్పారు. ఆ మార్గంలో వెళ్లకుండా ఘట్కేసర్ (ఎగ్జిట్-9) నుంచి భువనగిరి-వలిగొండ-రామన్నపేట మీదుగా చిట్యాల చేరుకోవచ్చని తెలిపారు. అలాగే గుంటూరు వైపు వెళ్లేవారు బొంగులూరు (ఎగ్జిట్-12) గేటు నుంచి ఇబ్రహీంపట్నం-మాల్-దేవరకొండ మీదుగా వెళ్లాలని సూచించారు.

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి పల్లెలకు బయల్దేరిన పట్టణవాసులతో కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులుతీరాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో కీసర టోల్‌ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వద్ద ప్రైవేటు ట్రావెల్స్ ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని మంత్రి పొన్నం హెచ్చరించారు. అదనపు ఛార్జీల పేరిట ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు బస్సులు ఎక్స్‌ట్రా ఛార్జీలు అడిగితే ప్రయాణికులు రవాణా శాఖ దృష్టికి తేవాలని మంత్రి సూచించారు. ఆర్టీసీ అధికారులు డిపోల వద్ద తనిఖీలు చేయాలని ఆదేశించారు.

Tags

Next Story