శ్రావణమాసం.. ఈ నెలలో పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. 28 వరకు ముహూర్తాలు

ఆషాఢమాసం ముగిసి శ్రావణ మాసం మొదల వడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. శ్రావణం రాకతో శుభ ముహూర్తాలకు వేళయింది. పెల్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలతోపాటు ఈ మాసంలోనే రాఖీపౌర్ణమి, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణాష్టమి తది తర పండగులు కూడా ఉండడంతో రాష్ట్రం వేడుకల శోభను సంతరించుకోనుంది.
సెప్టెంబరు మూడో తేదీతో శ్రావణమాసం ముగియనుంది. శ్రావణ మాసం మొదలైన నేపథ్యంలో కల్యాణ మండపాలు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. వీటిలో 17, 18 తేదీలు పెళ్లిళ్లకు అద్భుత తరుణమని పండితులు చెబుతున్నారు. మూడున్నర నెలల విరామం తర్వాత మళ్లీ వివాహ ముహుర్తాలు రావడంతో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. గత ఏప్రిల్ 28 నుంచిశుక్రమూఢమి, దానికి తోడు గురు మూఢమి కూడా రావడంతో వివాహాలకు బ్రేకులు పడ్డాయి.
మూడున్నర నెలల గ్యాప్ తర్వాత ముహూర్తాలు ఉండడం, ఇక శ్రావణమాసం కూడా రావ డంతో, పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముహుర్తాలు లేకపోవడంతో మూడు నెలల పాటు ఇబ్బందులు పడ్డామంటున్నారు పురోహితులు. కాగా ఆగస్టు నెల 31 లోపే శుభకార్యాలను ముగించుకోవాలని పురోహితులు సూచిస్తున్నారు. శుభ కార్యాల సీజన్ రావడంతో, కల్యాణ మండపాలు కూడా బుక్ అయి పోతున్నాయి. విద్యుత్ అలంకరణ, బాజాభజంత్రీలు, బ్యూటీషియన్లు, టెంట్ హౌస్ నిర్వాహకులు, ప్రింటింగ్ ప్రెస్, బట్టలు, కిరాణం, కేటరింగ్ ఇలా చాలా మందికి చేతి నిండా పని దొరుకుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com