Shubman Gill : అవ్‌నీత్ కౌర్ తో శుభ్‌మన్ గిల్ డేటింగ్?

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, టీవీ నటి అవ్‌నీత్ కౌర్ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆసీస్ సెమీస్ మ్యాచ్‌కు ఆమె హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. గతంలో గిల్, అవ్‌నీత్ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అవ్‌నీత్ కౌర్ గతంలో ప్రొడ్యూసర్ రాఘవ్ శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా గతేడాది శుభ్‌మన్ బర్త్ డే సందర్భంగా అవనీత్ సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపింది. గిల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీంతో వీరిద్దరిపై మరోసారి డేటింగ్‌పై చర్చ మొదలైంది. ఈ రూమర్స్ నేపథ్యంలో ఆమె రాఘవ్ శర్మ అనే నిర్మాతతో డేటింగ్ చేస్తున్నట్లు కొందరు అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కాగా.. క్రికెటర్ గిల్‌పై గతంలో కూడా సారా అలీ ఖాన్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com