CM Stalin : తమిళంలోనే సంతకాలు చేయండి!.. ఉద్యోగులకు స్టాలిన్ ఆదేశాలు

CM Stalin : తమిళంలోనే సంతకాలు చేయండి!.. ఉద్యోగులకు స్టాలిన్ ఆదేశాలు
X

తమిళనాడులో హిందీ భాషా వివాదం మరింత ముదిరింది. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాణిజ్య సంస్థలు, రెస్టారెంట్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్ బోర్డులను తమిళ భాషలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసిన స్టాలిన్ సర్కార్.. తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా తమిళంలోనే సంతకం చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రామేశ్వరంలో పంబన్ వంతెనను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోడీ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే నాయకులు ఎవరూ తామిచ్చే లేఖలపై తమిళంలో సంతకం చేయరని చెప్పారు. తమిళ భాష పట్ల మీకు గర్వంగా ఉంటే తమిళంలో సంతకం చేయాలని మోడీ సవాల్ విసిరారు. ఇది జరిగిన కొన్ని రోజులకు రాష్ట్ర ప్రభుత్వం భాషపై పలు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ప్రభుత్వ ఉత్తర్వులను మాత్రమే తమిళంలో ప్రచురించాలని పేర్కొంటూ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్క్యులర్ నోట్స్ కూడా తమిళంలోనే రాయాలని తెలిపింది.

Tags

Next Story