Singer Kalpana : భర్త గురించి వేడుకుంటూ గాయని కల్పన వీడియో

హై డోస్ లో స్లీపింగ్ పిల్స్ వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఓ వీడియో రిలీజ్ చేశారు. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని దాన్ని ఆపేయాలని విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఒత్తిడి కారణంగా నిద్ర పట్టలేదని అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్లు చెప్పారు. "మీడియాలో మా కుటుంబంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. దాని గురించి అందరికీ వివరణ ఇవ్వాలనుకుంటున్నా. నేను నా భర్త, కుమార్తె సంతోషంగా జీవిస్తున్నాం. నేను 45 సంవత్సరాల వయసులో పీహెచ్, ఎల్ఎల్బీ చేస్తున్నాను. నా భర్త సహకారం వల్లే ఇవ్వన్నీ చేయగలుగుతున్నా ఆయనతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు. మా కుటుంబం చాలా అన్యోన్యంగా ఉంది. వృత్తిపరమైన ఒత్తిడి కారణంగా నిద్ర పట్టడం లేదు. దానికోసం చికిత్స తీసుకుంటున్నాను. వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లో టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నాను. అందువల్లే స్పృహ తప్పి పడిపోయాను. నా భర్త సరైన సమయంలో స్పందించడం, కాలనీవాసులు, పోలీసుల సహాయం వల్ల నేను మీ ముందు ఉన్నాను. త్వరలోనే మళ్లీ నా పాటలతో మిమ్మల్ని అలరిస్తాను. ఆయన సహకారం వల్లే నచ్చిన రంగాల్లో రాణిస్తున్నాను. నా జీవితానికి బెస్ట్ గిఫ్ట్ నా భర్త. నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు" అని వీడియోలో చెప్పారు కల్పన.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com