IRCTC : దీపావళి, ఛత్‌ ఫెస్టివల్స్కు ప్రత్యేక రైళ్లు ఇవే

IRCTC : దీపావళి, ఛత్‌ ఫెస్టివల్స్కు ప్రత్యేక రైళ్లు ఇవే
X

దీపావళి, ఛత్‌ పండుగల నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పండుగల కోసం 14 ప్రత్యేక రైళ్లను ఎస్సీఆర్ ప్రకటించింది. మరో 26 స్పెషల్ ట్రైన్స్‌ను నడుపనున్నట్లు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం రద్దీని తగ్గించడం కోసం స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు తెలిపింది. కాచిగూడ-హెచ్ నిజాముద్దీన్, నాందేడ్ -పానిపట్, నాందేడ్-పాట్నా, చప్రా- యశ్వంత్ పూర్, చెన్నై- అంబాలా కాంట్‌కు ఈ ట్రైన్స్ రాకపోకలు సాగించనున్నట్లు ఎస్సీఆర్ ప్రకటించనుంది.

Tags

Next Story