Special Trains : తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం ప్రత్యేక రైళ్లు

తీర్ధ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని పివి. వెంకటేష్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐఆర్సిటిసి, టూరిజం గురువారం ఒక ప్రకటన లో తెలిపారు
తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం జూలై 19 వ తేదీ నుండి జూలై 26 వ తేదీ వరకు ప్రత్యేక ప్యాకేజీని “భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్” ద్వారా హైదరాబాద్ నుండి ప్రారంభిస్తున్నమన్నారు .
యాత్రకి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి
ప్యాకేజీ వివరాలు:
దివ్యదక్షిణయాత్ర జ్యోతిర్లింగంతో (SCZBG45):(తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు)
ఈ యాత్ర జూలై 19 వ తేదీన ప్రారంభమై 26 వ తేదీ వరకు ఉంట్టుంది.
దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర 14100,
3 ఏసీ ధర 22300,
2 ఏసీ ధర 29200 ఉంటుంది.
ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.
సౌకర్యాలు: రైలు, బస్సు, హోటల్, అన్ని భోజనాలు (ఉదయం అల్పాహారం, భోజనం మరియు రాత్రి భోజనం), వాటర్ బాటిల్ మరియు టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, (అదనపు ఖర్చు లేదు), ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగ ఉచితం.
ప్రతి రైలు లో 718 మంది ప్రయాణికులు ఉంటారు. ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సావకార్యాలు సమకురుస్తారు.
కోచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలు లో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030711, 9281030712, 9281495843, 9281030750 లకు సంప్రదించాలని. మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్సైట్ ని సంప్రధించాలని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com