ఔటర్ రింగ్ రోడ్డుపై ఎస్‌యూవీ బోల్తా.. ఐదుగురికి గాయాలు

ఔటర్ రింగ్ రోడ్డుపై ఎస్‌యూవీ బోల్తా.. ఐదుగురికి గాయాలు
X
సంగారెడ్డిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఎస్‌యూవీ బోల్తా పడడంతో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అమీన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కిష్టారెడ్డిపేట వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పై బుధవారం తెల్లవారుజామున ఎస్‌యూవీ అదుపు తప్పి బోల్తా పడింది. ఐదుగురు యువకులు గాయపడ్డారు.

క్షతగాత్రులను పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగం, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులను ఇంకా గుర్తించలేదు.

Tags

Next Story