అయోధ్య నగరం ఆదిపురుష్‌ సినిమాలో చూపించినట్లే ఉండేదా..!

అయోధ్య నగరం ఆదిపురుష్‌ సినిమాలో చూపించినట్లే ఉండేదా..!
మంచితనమంతా ఒకే చోట పోగు చేస్తే ఆ రాజ్యమే అయోధ్య. హనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్య క్షేత్రం అయోధ్య. సాక్షాత్తు విష్ణు భగవానుడి అవతారంగా కీర్తించిన..... శ్రీరాముడి ధర్మస్థలం. ఇక్కడి నేల పవిత్రం......... గాలి పవిత్రం... పరిసరాలు పవిత్రం. ఆ పవిత్ర, ఆధ్యాత్మిక నగరం అయోధ్య. కోసల దేశ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన ఈ నగరం ఎందరెందరో ఇక్ష్వాకు రాజులకు పుట్టిల్లుగా వెలిసింది.


దేవుడిగా కాకుండా మనిషిగా.......... శ్రీరాముడి అంతటి మహా యుగ పురుషుడు నడయాడిన నేల అయోధ్య. అంతటి పరమ పావనమూర్తి తిరిగిన నగరాన్ని..... అసలు ఎవరు ఏర్పాటు చేశారు. రాజధానిగా చేసుకొని.... శ్రీ రామచంద్రమూర్తి వేల ఏళ్లపాటు పరిపాలన సాగించేంత మహమాన్వితం అసలు ఆయోధ్యలో ఏముంది. సప్తరుషి నగరాలుగా పేరుగాంచిన ప్రాంతాలున్నా... శ్రీరామచంద్రుడు అయోధ్యనే రాజధానిగా ఎందుకు చేసుకున్నాడు...రాముడి కంటే ముందు అయోధ్య నగరం అసలు ఉనికిలో ఉందా..... ఉంటే ఆ నగరాన్ని ఎవరు పాలించారు... రాజ్యపాలనంటే ఇలాగే ఉండాలనేంత గొప్ప శ్రీ రామచంద్రమూర్తి... పాలన ఏం ఉంది... రాముడి పాలనలో అస్సలు పేదలే లేరా... దొంగతనాలు జరిగితే ఎలాంటి శిక్షలు విధించే వారు... శ్రీరామ నిర్యాణం తర్వాత లవకుశల పాలన ఎలా సాగింది.... రామరాజ్యం ఎంతవరకూ విస్తరించి ఉండేది వంటి ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం

తమ్ముడు లేకుండా నేనుండలేననే అన్న...... అన్న పాదుకలే నా ఇలవేల్పు అనే తమ్ముడు..... తండ్రి మాటే వేదం అనే కొడుకు....... రాజ్యమే మిన్న రాజు కన్నా అనే భార్య.... ఇలా మంచితనమంతా ఒకే చోట పోగు చేస్తే ఆ రాజ్యమే అయోధ్య. అయోధ్య అనే పేరు త్రేతాయుగంలోనిదే అయినా.. ఆ పేరు చెప్తే........ ఇప్పటికీ ఒళ్లు పులకరించి పోతుంది. ఎందరెందరో రాజులు, మహనీయుల పాదస్పర్శతో పునీతమైన పుణ్య క్షేత్రం అయోధ్య. సాక్షాత్తు విష్ణు భగవానుడి అవతారంగా కీర్తించిన..... శ్రీరాముడి ధర్మస్థలం. ఇక్కడి నేల పవిత్రం......... గాలి పవిత్రం... పరిసరాలు పవిత్రం. ఆ పవిత్ర, ఆధ్యాత్మిక నగరం అయోధ్య. ఈ పవిత్ర నగరాన్ని రాజధానిగా చేసుకునే...... శ్రీ రామచంద్రుడు.. రామరాజ్యాన్ని స్థాపించాడు.

అయోధ్య..... విష్ణమూర్తి ఏడో అవతారమైన శ్రీరామచంద్రుడు నడయాడిన నేల. శ్రీరాముడి పాలనా దక్షతకు.. ధర్మ ఆచరణకు... ప్రత్యక్ష సాక్షంగా నిలిచిన పవిత్ర నగరం. వేల ఏళ్ల భారత ఆధ్యాత్మిక వైభవానికి.... చారిత్రక సంపదకి... వేద విజ్ఞానానికి కొలువైన సుందర నగరం. అయోధ్యను రాజధానిగా... చేసుకుని 11 వేల ఏళ్లపాటు కోసల రాజ్యాన్ని ఏలిన రాముడు..తరతరాలు గుర్తుండిపోయేలా పరిపాలనను చేశాడు. అందుకే ఆ యుగ పురుషుడి పాలనను... స్వర్ణ యుగంతో పోలుస్తారు. రామరాజ్యంలోని గొప్ప నగరాలు పురాణాల్లో సప్తఋషి నగరాలుగా..ప్రసిద్ది చెందాయి. అందులో ముఖ్యమైనది.. అత్యంత ప్రధానమైనది అయోధ్య. అయోధ్యను సాకేతపురమని కూడా.... పిలిచేవారు. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది.

అయోధ్య విస్తీర్ణంలో చిన్నదైనా.........మహిమ రీత్యా ప్రఖ్యాతి నగరం. సాక్షాత్తు శ్రీ రామచంద్రుడు జన్మించిన అయోధ్య పూర్వనామం ‘సాకేత’. కోసల దేశ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన ఈ నగరం ఎందరెందరో ఇక్ష్వాకు రాజులకు పుట్టిల్లుగా వెలిసింది. ఇక్ష్వాకు మహారాజు కుమారుడైన వైవస్వతమను అయోధ్యను అభివృద్ధి పరిచినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. భారతదేశంలో అతి పురాతన పుణ్యధామాలలో ఒకటిగా, మహిమాన్విత ధామాలలో ఒకటిగా పేరుప్రఖ్యాతులు సాధించిన ‘అయోధ్య’కు ఆ పేరు రావడానికి శ్రీరాముడి తాతముత్తాతలే కారణం. శ్రీరాముని తాతలలో ఒకరైన ‘అయుధ’ అయోధ్య క్షేత్రాన్ని పాలించాడు. ఆ కారణంగా ఆయన తదనంతర కాలంలో ఈ క్షేత్రానికి అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ శక్యం కానిది....... అని అర్ధం. కానీ ఇందులోనూ చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. రామాయణాన్ని అనుసరించి .. తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం..వేదాలలో మొదటి పురుషుడిగా... హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న............ మనువు ఈ నగరాన్ని స్థాపించినట్లు చెబుతారు. మనువు కుమారుడు ఇక్ష్వాకు.... అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణ కథనాలు వివరిస్తున్నాయి.సరయూ నది ఒడ్డున దేవతలే ఈ పవిత్ర నగరాన్ని సృష్టించారని కూడా..చెబుతారు. సూర్య వంశానికే చెందిన పృధువు అనే రాజు వలన ఈ భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని చెబుతారు.


అయోధ్య...సమాజ వికాసానికి...... సంస్కృతీ పరిరక్షణకు.......... వేద విజ్ఞానానికి గమ్యస్థానంగా.... ఉండేది. సూర్యవంశపు 63వ రాజు దశరధుడి రాజ్య సభగా అయోధ్య పట్టణం ఉండేది. అధర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భువిపై ఉన్న స్వర్గ పురి అని పిలుస్తారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ వంటి అనేక పురాణ గ్రంధాల్లోనూ ఆయోధ్య పట్టణ గొప్పతనాన్ని వర్ణించారు. భక్తులకు మోక్షనిచ్చే ఏడు ఆధ్యాత్మిక నగరాల్లో అయోధ్య ఒకటి. అయోధ్యలో జన్మించి అయోధ్య పట్టణమే రాజధానిగా చేసుకొని.... శ్రీ రాముడు చాలాకాలం రాజ్య పరిపాలన చేశారు. అయోధ్య నగర వైశాల్యం అప్పట్లో 7.056 చదరపు కిలోమీటర్లు. వాల్మీకి రచనల ప్రకారం..... అయోధ్య నగరం అప్పట్లో చదరంగంలో ఉండే పలకల మాదిరిగానే అక్కడి భవన నిర్మాణాలు... ఉండేవని తెలుస్తోంది. ఈ భవనాలు అందంతో పాటు ప్రజల్ని కాపాడేందుకు శత్రువుల ఊహాలకు కూడా అందని విధంగా ఉండేలా... అప్పటి శిల్పులు నిర్మాణ విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకున్నట్లు... వాల్మీకి రచనల ద్వారా కనిపిస్తుంది. రామాయణంలోని బాలకాండలో అయోధ్య నగరం 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉండేదని ప్రస్తావించారు.


కోసల రాజ్యానికి తొలి రాజధాని అయోధ్య. ఈ నగరాన్ని రాజధానిగా చేసుకునే... ఇక్ష్వాకుడు, పృథు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘు, దిలీపుడు, దశరథుడు, రాముడు వంటి ప్రఖ్యాత చక్రవర్తులు పాలించారు. శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి. ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్‌కు 6 కిలోమీటర్ల దూరంలో సరయూ నదీ తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సర్వాంగ సుందరంగా..... శత్రు దుర్భేధ్యంగా నిర్మించినట్లు వాల్మీకీ రామాయణం చెబుతోంది. అయోధ్య నగరాన్ని శ్రీరాముడు పాలించిన కాలంలో అక్కడ అందరూ సంపన్నులుగానే ఉండేవారు. ధన, ధాన్యాలు పుష్కలంగా ఉండేవి.


సూర్యవంశస్థులైన ఇక్ష్వాకుల రాజులెందరో పాలించిన అయోధ్యలోనే 63వ రాజుగా పట్ట్భాషిక్తుడైన శ్రీరామచంద్రుడు ధర్మస్థాపన చేసి, విశేషమైన పేరు ప్రఖ్యాతులు సాధించాడు. అప్పట్లో వాణిజ్య పరంగా అయోధ్యతో......... పోటీ పడే నగరమే లేదు. ఇక్కడ క్రయవిక్రయాల కోసం.. వచ్చే వ్యక్తులతో నగరంలోని ప్రధాన వీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కేవలం కప్పం చెల్లించటానికే సామంత రాజులు ఇక్కడ బారులు తీరేవారు అని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్య నగరం మానవ జీవ చైతన్యానికి ప్రతీకని......... అధర్వణ వేదం చెబుతోంది. అయోధ్య మహిమను తెలుసుకున్న ఇతర దేశాల రాజులు... వారి దేశాల్లో కూడా ఈ పేర్లను అనుసరించారట. అలా ఇండోనేషియాలోని యోగ్యకర్త, థాయ్ లాండ్ లోని అయోధ్య వంటి నగరాలను పోలి ఉండటంతో వాటికి అయోధ్య అని పేరు పెట్టారు.


ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య.. మాట తప్పని వైనం, మడమ తిప్పని శౌర్యం.. ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వీటన్నింటీ ప్రతిరూపమే పరమపావన మూర్తి శీరామచంద్రమూర్తి. ఆ మహా పురుషుడి పాలన ఎలా ఉంటుందో... ఊహించుకోవచ్చు.


రావణుడిని యుద్ధంలో సంహరించిన తర్వాత.... తిరిగి అయోధ్య చేరుకొని శ్రీరాముడు పట్టాభిషక్తుడయ్యాడు. అనంతరం 11 వేల ఏళ్ల పాటు రాజ్యాన్ని నిరాటంకంగా...... ప్రజా రంజకంగా............ పరిపాలించాడు. నీతి తప్పని ధర్మబద్ద పాలన అందించడమే రామ రాజ్యమని బలంగా విశ్వసించాడు రాముడు. ప్రజలందరికీ సమాన న్యాయం, సమాన గౌరవం అందించడమే తన కర్తవ్యంగా భావించాడు. అయోధ్య ప్రజలే తనకు ముఖ్యమని..వారి యోగ క్షేమాలే తనకు పరమావధని భావించి రాజ్యపాలన చేసిన మహా మనిషి శ్రీరాముడు. అందుకే ఓ అనామకుడు లేవనెత్తి సందేహాన్ని పరిగణనలోకి తీసుకొని కట్టుకున్న భార్యను అగ్ని పరీక్షకు పంపి తనకు అందరూ సమానమే అని చాటిచెప్పినవాడు రాజు. శ్రీ రాముడి రాజ్యంలో ప్రతీ వ్యక్తి ఉన్నతమైన వ్యక్తిత్వంతో జీవించేవారు. మంచి పనులు మాత్రమే చేసేవారని రామాయణం వివరిస్తుంది. రామ రాజ్యంలో అస్సలు బాధలే ఉండేవి కావట. క్రూర జంతువుల నుంచి ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. శ్రీ రాముని పాలనలో దొంగతనాలు, దోపిడీలు ఉండేవి కావు. సమానత్వం ఉండేది. యువత చురుకుగా ఉండేది. రాముని పాలనలో ఏ ప్రాణికి కష్టం కలిగేది కాదు. అన్ని ప్రాణులు సుఖంగా జీవించేవి. రాముడి కరుణ కటాక్ష వీక్షణతో అన్ని ప్రాణులు హింసను విడనాడేవి. ప్రజలు సంపూర్ణ ఆయుష్షుతో జీవించేవారు. ప్రజలందరూ నిత్యం రామ నామమే స్మరించేవారు. రాముడే సర్వస్వంగా సర్వోత్తమంగా నిలిచేవాడు. బ్రాహ్మణులు, క్షత్రీయులు, వైష్ణవులు, శూద్రులు తమ తమ కర్తవ్యాలను నిష్టగా పూర్తిచేసేవారు. పనిలో సంతోషాన్ని వెతుక్కునేవారు. రామరాజ్యంలో అబద్ధాలు ఎవరూ మాట్లాడేవారు కాదు. సత్యమే మాట్లాడేవారు. ఇంతటి చక్కని పాలనలో ప్రజలకు శిక్షలు విధించే అవకాశమే రాముడికి వచ్చేదేకాదు. శ్రీరామచంద్రమూర్తి పాలనలో ప్రతి ఒక్కరూ సుఖ, సంతోషాలతో.... పాడి పంటలతో హాయిగా జీవించేవారని రామాయణం ఘోషిల్లింది. ప్రజలంతా ధర్మబద్ధంగా జీవించారు. ప్రతి ఒక్కరు భార్యా బిడ్డలతో కలకాలం ఆనందంగా గడిపారు. అనారోగ్యం, అపరిశుభ్రత ఆయన రాజ్యంలో లేవు. ఎవ్వరూ దుర్మరణం పాలు కాలేదు. ప్రజలంతా అయన్ని దేవుడనుకొనేట్లుగా.... శ్రీ రామచంద్రుడు..... రాజ్య పాలన చేశారు. రాముని పాలనలో ప్రజలు ధర్మ నిరతులై, ధర్మ పరాయణులై, సత్యవాదులై శుభ లక్షణ సంపన్నులై ఉండేవారని రామాయణం వివరించింది.


శ్రీరామ నిర్యాణం తర్వాత లవుడు, కుశుడు రామరాజ్యాన్ని పరిపాలించి... రాజ్యాన్ని మరింత విస్తరించారు. లవకుశులు.... లవపురి అంటే ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న లాహోర్‌... కసూర్ నగరాలను స్థాపించారు. లవకుశులు పరిపాలించిన రాజ్యంలో లాహోర్‌ నగరం కూడా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్‌... అఫ్ఘనిస్తాన్‌.... బర్మా వరకూ రామ రాజ్యాన్ని విస్తరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. లవుడు నిర్మించిన దేవాలయం ఇప్పటికి లాహోర్ లోని సాహిర్ జిలాల్లో ఉంది. ఇక కుశుడు పాలించిన కుషావతిని గోరాపూర్ లోని కష్ గా గుర్తించారు. ఇలా రామరాజ్యాన్ని విస్తరించిన లవకుశులు...జన రంజకంగా పాలన సాగించారు. రఘువంశ రాజులలో చివరి రాజైన సుమిత్రుడు వరకూ రామరాజ్య పాలన నిరాటంకంగా సాగింది. సుమిత్ర మహారాజు.... మగధ దేశ రాజు మహా పద్మనందుడి చేతిలో ఓడిపోవడంతో రఘువంశరాజుల పాలన సమాప్తమైంది.

Tags

Read MoreRead Less
Next Story