Water Found on Mars : మార్స్ పై నీటి జాడలు..!

మార్స్ పై ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. నాసా క్యూరియాసిటీ రోవర్ తాజాగా మార్స్ పై ఓ రహస్య ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. ఈ ప్రాంతంలో అక్కడ భూగర్భంలో నీరు చాలాకాలం పాటు క్రియాశీలంగా ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఇది మార్స్ వాతావరణ చరిత్రను తిరగరాసే అవ కాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ ప్రస్తుతం మౌంట్ షార్ప్ భాగంలోని బాక్స్వార్క్ ప్రాంతాన్ని పరిశీలిస్తోంది. ఇది మార్స్ ఉపరితలంపై 12 మైళ్ల పొడవున విస్తరించి ఉంది. ఇప్పటి వరకు ఇది కేవలం ఉపగ్రహాల ద్వారా మాత్రమే గమనించిన ఈ ప్రాంతానికి తొలిసారిగా రోవర్ చేరుకుంది. ఇక్కడి రాళ్లలో రాళ్లలో మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ వంటి ఉప్పు ఖనిజాలు అధికంగా ఉన్నట్లు గుర్తించింది. ఇవి సాధారణంగా నీరు ఆవిరైపోయిన తర్వాతే ఏర్పడుతాయి. దాంతో అక్కడ గతంలో నీరు ఉందని.. ఆ తర్వాత వాతావరణంలోని మార్పులతో ఎండిపోయి ఎడారిని తలపిస్తున్నట్లుగా సూచిస్తోంది.
కేవలం మట్టి, ఖనిజాలే కాకుండా రాళ్లలో మినరల్ విన్స్ని సైతం గుర్తించారు. నీరు చాలా కాలం పాటు భూగర్భంగా ప్రవహించి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది నిజమైతే, మార్స్ పై జీవనానికి అనువైన వాతావరణం భావించిన దానికంటే ఎక్కువ కాలం పాటు కొనసాగినట్లుగా అంచనా వేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com