Earthquakes : గత 15 రోజుల్లో తెలంగాణలో రెండు భూ ప్రకంపనలు

తెలంగాణ (Telagana) జిల్లాల్లో గత 15 రోజుల్లో రెండు భూకంపాలు సంభవించగా, తాజాగా ఫిబ్రవరి 18న సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, ఆదివారం జయశంకర్ (JayaShankar) భూపాలపల్లి జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం నమోదైంది. భారత కాలమానం ప్రకారం 07:32:21 (IST) సమయంలో సంభవించిన ప్రకంపనలు 10 కి.మీ లోతుగా నమోదయ్యాయి. ఫిబ్రవరి 5న వికారాబాద్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 2.5 తీవ్రతతో భూకంపం నమోదైంది.
తెలంగాణలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందా?
భారతదేశం నాలుగు భూకంప మండలాలుగా విభజించబడింది అవి: జోన్ II, జోన్ III, జోన్ IV, జోన్ V. తెలంగాణ ప్రధానంగా జోన్ II కిందకు వస్తుంది. దీని వలన భూకంపాలు తక్కువగా ఉంటాయి. అయితే, రాష్ట్రంలోని కొన్ని తూర్పు ప్రాంతాలు జోన్ III కిందకు వస్తాయి. భారతదేశంలోని గుజరాత్ (Gujarat), ఉత్తరాఖండ్ (Uttarakhand), హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) మరియు ఈశాన్య రాష్ట్రాలు భూకంపాలకు ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే అవి జోన్ V పరిధిలోకి వస్తాయి. తెలంగాణలో ఫిబ్రవరి 5న 2.5 తీవ్రతతో నమోదైన భూకంపాన్ని మైనర్‌గా పరిగణిస్తారు. అయితే జయశంకర్ భూపాలపల్లిలో భూకంపం తీవ్రత 3కి మించి నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com