D.K. Parulkar : యుద్ధవీరుడు డీకే పారుల్కర్‌ కన్నుమూత

D.K. Parulkar : యుద్ధవీరుడు డీకే పారుల్కర్‌ కన్నుమూత
X

1971 ఇండో-పాక్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ డి.కె. పారుల్కర్ (D.K. Parulkar) కన్నుమూశారు. ఆయన వయసు 82. పుణెలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు ఆదిత్య తెలిపారు. 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాలలో భారత వాయుసేన (IAF) తరపున పాలుపంచుకున్నారు. ఆయన అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించి, భారత దేశానికి గొప్ప సేవలు అందించారు. 1965 యుద్ధంలో శత్రువుల కాల్పులకు ఆయన విమానం దెబ్బతిన్నప్పటికీ, వెనక్కి తగ్గకుండా విమానాన్ని సురక్షితంగా బేస్ క్యాంప్‌కు చేర్చారు. ఈ ధైర్యానికి గాను ఆయనకు వాయుసేన మెడల్ లభించింది. 1971 యుద్ధ సమయంలో, పాకిస్తాన్ సైన్యానికి యుద్ధ ఖైదీగా పట్టుబడ్డారు. అయితే, ఆయన మరో ఇద్దరు సహచరులతో కలిసి పాక్ చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ సాహసానికి ఆయనకు విశిష్ట సేవా మెడల్ లభించింది. డి.కె. పారుల్కర్ మరణం పట్ల భారత వాయుసేన తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన వీరోచిత సేవలు, దేశభక్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడింది.

Tags

Next Story