Wedding Season : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి... ముహూర్తాలివే

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. ఆక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో భారీగా వివాహాలు జరగనున్నాయి. ఈ 3 నెలల్లోని కొన్ని తేదీలను పండితులు పెళ్లి ముహూర్తాలుగా నిర్ణయించారు. ఇప్పటికే నవంబర్, డిసెంబర్ లో ముహూర్తాలు పెట్టగా, ఈనెలలోనూ ఆక్టోబర్ 12వ తేదీ నుంచి పెళ్లిళ్లు మొదలయ్యాయి. ఆక్టోబర్ లో 13,16,20,27, నవంబర్ లో 3,7,8,9,10,13,14,16,17, డిసెంబర్ లో 5,6,7,8,11,12, 14,15, 26 తేదీలు వివాహాలకు అనుకూలమైనవని పండితులు వెల్లడించారు. గత ఐదేళ్లలో 3 జిల్లాల్లో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా.. ఈ మూడు నెలల్లో దాదాపు 5 వేల పెళ్లిళ్లు జరగనున్నట్టు ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా పెరిగాయని పేర్కొంటున్నారు.దసరాతో మొదలయ్యే శుభకార్యాలు.. కొత్త ఏడాది వరకు వరుసగా జరుగనున్న నేపథ్యంలో అటు బట్టలు దుకాణాలు, బంగారం దుకాణాలు కస్టమర్లతో కళకళలాడనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com