చంద్రబాబు చిత్ర పటానికి ధాన్యంతో అభిషేకం

చంద్రబాబు చిత్ర పటానికి ధాన్యంతో అభిషేకం

అన్నదాత పథకం కింద ప్రతి ఏటా రైతుకు 20 వేలు ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించడంపై పశ్చిమ గోదావరి జిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పోడూరు మండలం పెనుమదంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో రైతులు చంద్రబాబు చిత్ర పటానికి ధాన్యంతో అభిషేకం చేశారు. రైతు రాజ్యం.. చంద్రబాబు రాజ్యం, రైతుపక్షపాతి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.

జగన్ పాలనలో రైతులు పంటను అమ్ముకోలేక రోడ్డున పారబోసే పరిస్థితి ఏర్పడిందన్నారు నిమ్మల రామానాయుడు. రైతులు ధాన్యం అమ్ముకోవాలంటే మిల్లర్లుకు డబ్బలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందన్నారు. జగన్‌ రైతు పక్షపాతి కాదు.. భక్షపాతి అని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story