Cigarette : సిగరెట్ తాగిన తర్వాత ఈ పండు తినండి.. హాని తగ్గుతుంది
సిగరెట్ (Cigarette) తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా కూడా చాలామంది సిగెర్ట్స్ తాగుతూనే ఉంటారు. సిగరెట్ లేదంటే బీడీ తాగటం వల్ల నికోటిన్ అనే పదార్థం శరీరంలో ఉత్పత్తి అవుతుంది. ఇవి వేగంగా మెదడుకు చేరి ఒక రకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. అది మీ ఆరోగ్యమును దెబ్బతీస్తుంది. మీరు ఒక్కసారి పొగ తాగితే అందుకు సంబంధించిన నికోటిన్ మీ శరీరంలో దాదాపు మూడు రోజులపాటు ఉంటుంది.
మీరు ధూమపానం చేసిన ఆ ప్రభావం మీ ఆరోగ్యం పై పెద్దగా పడకుండా ఉండాలంటే మీరు పొగ తాగిన తర్వాత కొన్ని రకాల పండ్లు ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. అయితే ఇవన్నీ కూడా ధూమపానం వల్ల ఊపిరితిత్తులపై పడే ప్రభావాన్ని కాస్త మాత్రమే తగ్గిస్తాయని విషయాన్ని గుర్తుంచుకోవాలి. యాపిల్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు ఆమ్లా జనులు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను ఎదుర్కోవడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు సిగరెట్ తాగిన వెంటనే ఒక యాపిల్ తింటే చాలా మేలు చేస్తుంది.
వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల్లో నికోటిన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ రక్తంలో ఉండే కొవ్వును కూడా తగ్గించగలదు. వెల్లుల్లిలో యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మలోని ఆంటీ ఆక్సిడెంట్లు దండిగా ఉంటాయి. శరీరానికి రక్తప్రసన్న సక్రమంగా సాగేలా చేయగల గుణాలు దానిమ్మలో ఉన్నాయి. దానిమ్మను పండును తిన్న లేదా దాంతో జ్యూస్ చేసుకుని తాగిన చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఒక క్యారెట్ తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఊపిరితిత్తుల్ని దెబ్బతీయకుండా చేయగల గుణాలున్న గ్రీన్ టీ తాగడం కూడా చాలా మంచిది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com