Pomegranate : షుగర్ పేషెంట్లు దానిమ్మ పండు తినొచ్చా..

Pomegranate : షుగర్ పేషెంట్లు దానిమ్మ పండు తినొచ్చా..

షుగర్ వ్యాధి కోట్లమందిని వేధిస్తోంది. ప్రస్తుత లైఫ్ స్టైల్ లో ఆహారపు అలవాట్లు, శరీరక శ్రమ లేకపోవడం కారణంగా ఈ వ్యాధి బాధితులు పెరుగుతున్నారు. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే.. జీవితకాలం దానితో పోరాడుతూ ఉండాలి. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు ఏ ఆరాన్ని పడితే ఆ ఆహారాన్ని తీసుకోకూడదు. ఏది తినాలన్నా ఆలోచిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్రూట్స్ జోలికి అసలు వెళ్ళరు. ఎందుకంటే ఫ్రూట్స్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండి.. రక్తంలో చక్కెరను అధికం చేస్తాయని వారు భయపడుతూ ఉంటారు.

సపోటా, మామిడి, చెర్రీ, గ్రేప్స్, ఖర్జూరం, అరటి లాంటి పండ్లు ఆ జాబితాలోకి వస్తాయి. మరి దానిమ్మ పండు షుగర్ వ్యాధి ఉన్నవారు తినవచ్చా.. లేదా.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆరోగ్యానికి అత్యంత మేలు చేసి శరీరంలో రక్తస్థాయిని పెంచే ఫ్రూట్స్‌లో మొదటిది దానిమ్మ. విటమిన్ సి, కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్ లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి సమృద్ధిగా అందిస్తుంది. జీవక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుపరచడానికి సహకరిస్తుంది. ఎముకలను బలోపేతం చేయడానికి.. కణ విభజన, రక్త పోటును నియంత్రించడానికి కూడా కీలకపాత్ర వహిస్తుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మెరిపిస్తుంది. రక్తహీనతను తరిమికొట్టి.. ఎర్ర రక్త కణాల నిర్మాణానికి తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా దానిమ్మ ఎంతగానో సహకరిస్తుంది. ఐతే.. దానిమ్మను పరిమితంగా షుగర్ పేషెంట్లు తీసుకోవడం మంచిది.

Tags

Next Story