Corona: గుండెపై ప్రభావం చూపిస్తున్న కరోనా.. చిటికెలో పోతున్న ప్రాణం..

Corona: కరోనావైరస్ మొదట్లో శ్వాసకోశ వ్యాధిగా భావించినప్పటికీ, అది మీ శరీరంలోని ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుందని వైద్యులు నిర్ధారించారు. గుండె, రక్త ప్రసరణ వ్యవస్థ, మెదడు, మూత్రపిండాలు, కాలేయం, జీర్ణ వ్యవస్థతో పాటు మరికొన్ని ఇతర వ్యవస్థల పనితీరును నిర్వీర్యం చేస్తుంది.
శరీరంలోని అన్ని భాగాలకు సక్రమంగా పనిచేయడానికి ఆరోగ్యకరమైన రక్త సరఫరా అవసరం. కరోనా తీవ్రత రక్తనాళాలను దెబ్బతీస్తుంది. రక్తం గడ్డకట్టడం, రక్త ప్రవాహ వేగాన్ని తగ్గించడం జరుగుతుంది. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఉన్న వ్యక్తులకు కోవిడ్ వారికి మరో సమస్యగా మారుతుంది. ఎందుకంటే వారికి రక్తనాళాల లోపలి పొర దెబ్బతినే ప్రమాదం ఉంది.
కోవిడ్-19 గుండె, రక్త ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసే అంశాలు..
రక్తం గడ్డకట్టడం
వేగవంతమైన హృదయ స్పందన
ఆక్సిజన్‌తో పాటు ఇతర పోషకాలు లేకపోవడం వల్ల గుండె దెబ్బతింటుంది
గుండె కండరాల వాపు
రక్తం గడ్డకట్టడం
కోవిడ్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన వ్యక్తుల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాలు దెబ్బతినడం వల్ల శరీరం ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (పల్మనరీ ఎంబోలిజం) వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి.
గుండె వేగంగా కొట్టుకోవడం..
కోవిడ్-19 జ్వరం తర్వాత గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు ఎక్కువ రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడుతుంది. ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే అది ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఇది గుండెకు చేరే ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది. వైరస్ రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది ఊపిరితిత్తులకు సరఫరా చేసే రక్త నాళాలలో గుండెకు ఆక్సిజన్ సరఫరాను పరిమితం చేస్తుంది.
చాలా మంది వ్యక్తులకు ఎటువంటి లక్షణాలు లేకపోయినా గుండెపోటుకు గురవుతున్నారు. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, గుండె మెలిపెట్టినట్టుగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలలో దేనిని గమనించినా వైద్య సలహా తీసుకోవాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com