Health Benefits : చలికాలంలో అల్లం.. ఆరోగ్యానికి వరం

చలికాలంలో అల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో టీ, సూప్, కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. గ్యాస్, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి అల్లం మంచి ఔషధంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు శీతాకాలంలో ప్రతిరోజూ అల్లం తినాలి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, కఫం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. దీని కోసం మీరు అల్లం టీ తాగవచ్చు.
అల్లం రసంను నిత్యం సేవిస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, వాపులను తగ్గించడంలో అల్లం సమర్థవంతంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ అల్లంను తగిన మోతాదులో తీసుకుంటే ఆర్థరైటిస్ నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com