తనివితీరా ఏడవండి..? ఎందుకో తెలుసుకోండి..

తనివితీరా ఏడవండి.. ఏంటి ఏడవమంటారు అని అనుకుంటున్నారా.. ఒకరు నవ్వు నాలుగు విధాల చేటు అంటారు. నవ్వుతు బ్రతకాలి అంటారు మరోకరు. నవ్వే కాదు ఏడుపు కూడా మంచిదేనట. ఏడవడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనిషి ఈ ఉరుకులుపరుగుల జీవితంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. దాంతో కాస్త స్ట్రెస్ రిలీఫ్ కోసం వ్యాయామం, లాఫర్ యోగా వంటివి ప్రయత్నించి సేదతీరుతున్నాడు. అయితే వైద్య నిపుణులు మాత్రం మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంతముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. ఏడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో చూద్దాం..
కన్నీళ్లు మూడు రకాలు:
బాసల్ టియర్స్: నిమిషానికి ఒకటి నుంచి రెండు మైక్రోలీటర్ల వరకు ఉత్పత్తి అయ్యే ఈ కన్నీళ్లు కళ్లను తేమగా ఉంచడంతోపాటు ఇన్‌ఫెక్షన్‌ల నుంచి కాపాడతాయి.
రెప్లెక్స్ టియర్స్: ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్లల్లో దుమ్మూధూళి పడ్డప్పుడు కళ్ల మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
ఎమోషనల్ టియర్స్: ఇది ఎక్కువగా భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్లనుంచి నీరు ఉబికి వస్తుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి దూరమవుతుంది.
అప్పుడప్పుడు ఏడవటం ద్వారా మన బి.పి కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు ఏవీ దరిచేరవు.
కన్నీళ్లలో ఉండే ఐసోజైమ్‌లు, క్రిములు, బ్యాక్టీరియాల నుంచి కన్నుకు రక్షణ కల్పిస్తాయి.
మనం ఏడిస్తే కళ్ల నుంచి నీరు కారడం వల్ల కంటికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి మన కళ్లల్లో ఉండే దుమ్ము, మలినాలు బయటకు పోగొడతాయి.
మన మెదడులో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు రిలీజ్ కావడంతో శారీరక, మానసిక భావోద్వేగాలకు మార్పులు ఏర్పడతాయి.
ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
ఏడవడం వల్ల మెదడు శరీర ఉష్ణోగ్రతలు సంతులితంగా ఉంటాయి. మనం సమన్వయంతో ఆలోచించగలుగుతాం.
కన్నీళ్లు రావడం వల్ల చెడు ఆలోచనలు దూరం కావడంతోపాటు, మానసిక ప్రశాంతత కలిగి పాజిటివ్ ఆలోచనల వైపు దృష్టి మరులుతుంది.
ఇప్పుడు తెలుసుకున్నారుగా ఏడుపు ఎంత మంచిదో.. మన కన్నీరు మనకి ఎంత మంచి చేస్తుందో చూశారుగా.. అందుకే ఓ మహా కవి అన్నారు ఏడ్చినా నవ్వినా కన్నీళ్లే వస్తాయని.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com