Guava : జామ పండు తింటే.. జన్మలో ఈ ఆరోగ్య సమస్యలు రావు

Guava : జామ పండు తింటే.. జన్మలో ఈ ఆరోగ్య సమస్యలు రావు
X

పండ్లలో ఎన్నో పోషకాలు దాగుంటాయి.అరటి పండు, ఆపిల్, జామ, నారింజ, బొప్పాయి, ద్రాక్ష, దానిమ్మ, పైనాపిల్స్ వంటి పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటిని రోజూ తింటే.. పలు సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలాంటి పండ్లలో జమ పండు ముందు వరుసలో ఉంటుంది. రుచి పరంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా జామ పండు ఎంతో మేలు చేస్తుంది. జామ పండు తింటే ఎలాంటి సమస్యలు రావో తెలుసుకుందాం.

జామ పండులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, కార్బోహైడ్రేట్లు, డైటరీ ఫైబర్, కేలరీలు, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు అంటువ్యాధుల నుండి రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జామ ఆకు కూడా ఎంతో మేలు చేస్తుంది. మహిళలు.. రోజూ జామ ఆకు రసం తీసుకుంటే.. పీరియడ్స్ పెయిన్ ను తగ్గిస్తుంది.

అలాగే.. జామకాయలో విటమిన్ బి6, విటమిన్ బి3 పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజుకో జామ పండు తింటే.. మధుమేహం, గుండె సమస్య, బరువు పెరగడం, చర్మ సమస్య, పీరియడ్స్ పెయిన్ వంటి సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

Tags

Next Story