పరిగడుపున నీళ్ళు తాగుతున్నారా... ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..!

మనిషి బ్రతకాలంటే కేవలం ఆహారం ఒక్కటే సరిపోదు.. సరిపడా నీరు కూడా ముఖ్యమే.. కానీ చాలా మంది నీరును ఎక్కువగా తీసుకోరు.. దీనితో తెలియకుండానే అనారోగ్యానికి గురవుతుంటారు. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి శరీరానికి అవసరమయ్యే నీటిని తీసుకోవడం అలవాటు చేసుకుందాం. ఇదిలా ఉంటే పరిగడుపున నీళ్ళని తాగితే మంచి ప్రయోజనాలున్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
♦ ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీటిని తీసుకోవడం వల్ల తిరిగి మన శరీరం రీహైడ్రేషన్ స్థితికి వస్తుంది. దీనివలన రోజంతా ఎంతో త్సాహంగా పనులు చేసుకోవచ్చు.
♦ అంతేకాకుండా పరిగడుపున నీళ్ళు తాగడం వలన జీవక్రియ రేటు పెరుగుతుందని దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని అంటున్నారు వైద్యులు.
♦ ఇక మలబద్ధకం లాంటి సమస్య పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు.
♦ పరిగడుపున నీళ్ళు తాగడం వలన ఆరోగ్యం మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగామనే అంటున్నారు. ముఖంపై ఉండే పింపుల్స్ కూడా తగ్గిపోయి ముఖం మంచి గ్లో కూడా వస్తుంది.
♦ ఎర్రరక్తకణాలు యాక్టివ్ అవుతాయి. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పెరిగి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతాయి.
♦ శరీరానికి కావాల్సినంత నీళ్లు తీసుకోకపోతే డీ హైడ్రేషన్ కు దారితీస్తుంది. దీంతో అనేకమైన ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com