Health Issues : టాయిలెట్ లో ఫోన్ తో ఆరోగ్య సమస్యలు

టాయిలెట్ కమోడ్ పై కూర్చుని ఫోన్లో సుదీర్ఘ సంభాషణలు.. ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు తేల్చారు. ఇలా ఎడతెగని సంభాషణలు చేసేవారిలో మొలలు, యానల్ ఫిస్టులాలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తు న్నారు. హెమరాయిడ్లు, ఫిస్టులా కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. నీరు సరిపడినంత తాగకపోవడం, చిరుతిళ్లు ఎక్కువగా తినడం, టాయిలెట్లో ఎక్కువ సమయం గడపడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం, జీవనశైలిలో మార్పులు, పోషకాహార లేమి తదితర కారణాలు ఈ సమస్యలకు దారితీస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎక్కువసేపు టాయిలెట్లో కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. దీనివల్ల నొప్పితో కూడిన ఇన్ఫ్లమేషన్ సమస్య వస్తుందని, ఫలితంగా మొలలు, తీవ్ర కేసుల్లో యానల్ ఫిస్టులాలు ఉత్పన్నమవుతున్నట్లు వివరించారు. అయితే, ఇలాంటి రుగ్మతలకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆబ్లిగేషన్ ఆఫ్ హెమరాయిడ్స్ చికిత్స అందుబాటులోకి వచ్చిందని వైద్యులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com