Stress : ఒత్తిడిని ఎలా నివరించవచ్చంటే?

Stress : ఒత్తిడిని ఎలా నివరించవచ్చంటే?

ఆఫీసుల్లో పని గంటలపై మార్గదర్శకాలివ్వాలి. వారానికి 48-55 గంటలకు మించకూడదు. ఇది మించితే గుండెపోటు, అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంది. ప్రతి కంపెనీలో సైకాలజిస్టులు& కౌన్సెలర్లు ఉండాలి. వారు ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. ఉద్యోగులపై పనిభారం పడకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ధ్యానం, శ్వాస వ్యాయామాలు, యోగా, హెల్తీ ఫుడ్, సరైన నిద్ర వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. పని ఒత్తిడితో ఉద్యోగులు చనిపోతున్న క్రమంలో ప్రముఖ వైద్యులు సుధీర్ కుమార్ కీలక సూచనలు చేశారు. ‘20-40 ఏళ్ల ఉద్యోగులు తలనొప్పి, నిద్రలేమి, మెడనొప్పి, వెన్నునొప్పి, మానసిక సమస్యలు వంటివి ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 90% మంది ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉందని చెప్పారు. ఒత్తిడి పనితీరుపై ప్రభావం చూపుతుంది. మరిన్ని తప్పులు చేస్తారు. అలాంటివారు ఆనందాన్ని కోల్పోతారు. సెలవులు పెడతారు’ అని చెప్పారు.

Tags

Next Story