Skin Protest : వర్షాకాలంలో చర్మాన్ని ఇలా కాపాడుకోండి

వర్షాకాలంలో పొడిబారిన స్కిన్ తో చాలామంది చిరాకుగా ఫీలవుతుంటారు. అన్ని రకాల స్కిన్ వాళ్లు తప్పకుండా తమ స్కిన్ ను ఎక్సఫోలియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగించుకోవాలి.
వర్షాకాలంలోనూ సన్ స్క్రీన్ లోషన్ ను ఉపయోగించాలి. మీరు వేసుకునే మేకప్ చాలా సున్నితమైనది అయి ఉండాలి. రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ రాసుకోవడం మర్చిపోకూడదు. జిడ్డు చర్మం ఉన్నావారు తప్పకుండా ఈ సీజన్లో రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
పొడి చర్మం గలవారు ముఖం శుభ్రం చేసుకున్నాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. చర్మం దురద సమస్య ఉన్నవారు వర్షంలో తడిచి వచ్చిన తర్వాత శుభ్రంగా స్నానం చేశాక సహజమైన ఉత్పత్తులను చర్మానికి రాసుకోవాలి. వీలైనంత వరకూ ఈ సీజన్లో మేకలకు దూరంగా ఉండాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com