Health : పండ్లు మెరవాలంటే ఇలా చేయండి

మెరిసే దంతాల కోసం పరితపించని వాళ్లు ఉండరు. పసుపు దంతాలు ఉండే వారు నలుగురిలో మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంటారు. తమను అవతలివాళ్లు ఏదో అనుకుంటారేమో అనే భావనతో ఉంటారు. నవ్వడానికి కూడా మొహమాటపడుతుంటారు. సింపుల్ చిట్కాలతో మీ దంతాలు తెల్లగా మెరవడమే కాదు దృఢంగా కూడా ఉంచుకోవచ్చు.
ఉప్పు, నిమ్మ కాంబినేషన్ మీ దంతాలను మెరిపిస్తుుంది. రెండు చిటికెల ఉప్పు తీసుకుని అందులో 5-6 చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ పళ్ల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. కడిగేసిన తర్వాత మీ పళ్లపై మెరుపును చూడండి. దంతాలు బలంగా మారడానికి కూడా ఉప్పు, నూనె సహకరిస్తుంటాయి. అందుకే మీ టూత్ పేస్టులో ఉప్పు ఉందా అనే యాడ్ అంత పాపులర్ అయింది. ఉప్పు, నిమ్మకాయల కలయిక.. పళ్లను బలంగా చేయడానికి తోడ్పడుతుంది.
ఒక చిన్న బౌల్ లో 2 చిటికెల ఉప్పు (Salt) వేసి, అందులో 5-6 చుక్కల ఆవాల నూనె ను వేసి బాగా కలపండి. మీ దంతాలు, చిగుళ్లపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత నీటితో బాగా కడిగేయండి. పళ్లు తెల్లగా మారుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com