Relief from Acidity : అసిడిటితో బాధపడుతున్నారా? ఇలా చేస్తే చిటికెలో మాయం

Relief from Acidity : అసిడిటితో బాధపడుతున్నారా? ఇలా చేస్తే చిటికెలో మాయం
X

చాలా మంది జీర్ణ సంబంధిత వ్యాధి అయిన ఎసిడిటితో బాధపడుతుంటారు. ప్రస్తుత బిజి లైఫ్ లో సమయానికి సరిగా తినకపోవడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఎసిడిటికి కారణమవుతున్నాయి.

అసిడిటీ, గ్యాస్ట్రిక్ అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఆహారం తిన్న తర్వాత జీర్ణాశయంలో మంట, ఛాతిలో మంటతో ఇబ్బంది పడుతుంటారు. ఎసిడిటీ తరచూ గుండెలో మంట, అజీర్తి వంటి అనారోగ్యాలకూ దారితీస్తుంది. ఎసిడిటి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులు సూచించిన మందులు వాడుతుంటారు.

ఎసిడిటీ సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటే చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. "అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి సబ్జా గింజలతో మంచి ఉపశమనం. లభిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా సబ్జా గింజలు కలిపిన నీటిని తీసుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలను లీటర్ నీటిలో వేసి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ఆ రసాన్ని రోజూ తీసుకుంటే మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుందంటున్నారు.

రోజూ భోజనం చేశాక 1 టీ స్పూన్ సోంపు తీసుకోండి. దీని వల్ల అసిడిటీ దూరమవుతుంది. సోంపును నేరుగా తీసుకోవచ్చు. లేదా ఓ కప్పు నీటిలో స్పూన్ సోంపును వేసి మరిగించి కూడా తీసుకోవచ్చు. టీస్పూన్ సోంపు గింజలను వేడి నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టిన నీటిని తాగితే ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. సోంపు గింజల్లోని నూనె వంటి పదార్థం జీర్ణక్రియకు హెల్ప్ చేసి మంటను తగ్గిస్తుంది.

గ్లాసు చల్లని పాలు తాగడం వల్ల కూడా మీ పొట్టకు ఉపశమనం లభిస్తుంది. ఎసిడిటీ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లంలోని సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎసిడిటీని తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇకపోతే, అసిడిటీ సమస్యకు అరటిపండు మేలు చేస్తుంది. అరటిపండులో ఆల్కలీన్ లక్షణం కలిగి ఉన్నందున, కడుపు ఆమ్లం కోసం సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ఎసిడిటీ అనిపించినప్పుడల్లా, అరటిపండును సగం తీసుకుని దానిపై నల్ల ఉప్పు వేసి తింటే అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Next Story