Benefits of Walking : ఎంత నడిస్తే అంత ఆరోగ్యం

Benefits of  Walking : ఎంత నడిస్తే అంత ఆరోగ్యం
X

వాకింగ్.. ప్రస్తుత ఎక్కువమంది ఫాలో అవుతున్న ఫిట్ నెస్ ఫ్రీక్.జిమ్ లు, ఫిట్ నెస్ సెంటర్లలో మాదిరిగా కష్టమైన వర్కవుట్స్ ఏమీ లేకుండా ఈజీగా చేయగలిగే ఏకైక ఎక్సర్ సైజ్ వాకింగ్. డయాబెటిక్ పేషెంట్లకు ఈ వాకింగ్ ఎంతో అవసరమని డాక్టర్లు చెబుతుంటారు. వాస్తవానికి నడక అందరికీ ఆరోగ్యాన్నిచ్చేదే. ఈ విషయం తెలిసినప్పటికీ ఉదయాన్నే లేవడానికి బద్ధకమై కొందరు వాకింగ్ కు దూరంగా ఉండిపోతున్నారు.ఉదయం నిద్రలేవటమే ఆలస్యం.. ఉరుకులు పరుగుల బిజీ లైఫ్​.

నడవాలనే ఆలోచన బ్రెయిన్ లోకి రాగానే రేపటి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ మార్నింగ్ లేవగానే మళ్లీ రోటిన్ షెడ్యూల్. దీంతో బాడీకి ఫిజికల్ వర్క్ తగ్గి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకైతే రక్తంలో గ్లూకోజు స్థాయి పెరిగిపోతుంది.

ఎలా స్టార్ట్ చేయాలి..

వాకింగ్ ను ఎవరైనా.. ఎప్పుడైనా మొదలుపెట్టొచ్చు. 45 ఏళ్ల లోపు వారికి ఎలాంటి పరీక్షలు అవసరం లేదు. 45 ఏళ్లు దాటినవారు..నడిస్తే ఆయాసం, గుండెనొప్పి, అధిక రక్తపోటు వంటి సమస్యలున్న వారు ముందుగా డాక్టర్‌ను కన్సల్ట్ అయ్యి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నవయసు నుంచే డయాబెటిక్ టైప్1 ఉన్న వారు డాక్టర్ సూచన మేరకే వాకింగ్, వర్కవుట్స్ చేయాలి. ఎందుకంటే వీళ్లు ఇన్సులిన్‌ తీసుకుంటుంటారు కాబట్టి రక్తంలో గ్లూకోజు బాగా పడిపోయే అవకాశముంది.డయాబెటిక్ టైప్2 ఉన్న వారు అందిరిలాగే వాకింగ్ చేయొచ్చు. ముందుజాగ్రత్తగా గ్లూకోజు బిస్కట్లు పెట్టుకోవటం మంచిది. గ్లూకోజు పడిపోయినట్లనిపిస్తే వెంటనే తినటానికి ఉపయోగపడతాయి.

ఇవి ఫాలో అయితే బెటర్..

వాకింగ్ చేసేవారు మొదటి 5 నిమిషాలు చాలా మెల్లగా నడవాలి. దీంతో శరీరం వ్యాయామం చేయటానికి అనువుగా తయారవుతుంది. కండరాలు, కీళ్లు కదులుతాయి. ఒకేసారి వేగంగా నడవటం మొదలెడితే కండరాలు పట్టేయటం, కీళ్లనొప్పుల వంటి ఇబ్బందులు ఎదరవుతాయి. మెల్లగా 5 నిమిషాలు నడిచిన తర్వాత 30 నిమిషాల సేపు వేగంగా నడవాలి. నడకలో వేగం మూలంగా ఆయాసం వంటివి రాకుండా చూసుకోవాలి. వేగంగా నడిచిన వెంటనే నడవటం ఆపొద్దు. నెమ్మదిగా స్పీడ్ తగ్గించుకుంటూ రావాలి. అలా తక్కువ వేగంతో 5 నిమిషాలు నడవాలి. దీంతో కండరాలు పట్టేయటం వంటివి ఉండవు. ఒక్కసారిగా వేగాన్ని ఆపేస్తే తలతిప్పడం లాంటిది జరిగే అవకాశం ఉంది.ప్రతివారం వేగంగా నడిచే సమయాన్ని 5 నిమిషాల చొప్పున పెంచుకుంటూ 30 నిమిషాల వరకు చేరుకోవాలి. శారీరంగా బలంగా గలవారు 40-60 నిమిషాల వరకూ పెంచుకోవచ్చు. అయితే,రోజూ కనీసం 30 నిమిషాల సేపైనా నడిస్తే మరిన్ని ప్రయోజనాలు అందుకోవచ్చు.

ప్రయోజనాలెన్నో..

వాకింగ్ ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు ఇమ్యూనిటీని పెంచుతుంది. గుండెపోటు రాకుండా కాపాడుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. చెమట ద్వారా రక్తంలోని మలినాలు బయటకుపోతాయి.బీపీ కంట్రోల్ లో ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది.రక్తంలో గ్లూకోజు స్థాయి తగ్గుతుంది.శరీర బరువు తగ్గుతుంది. డిప్రెషన్, ఆందోళన, ప్రెజర్ తగ్గుతాయి. కీళ్లు, ఎముకలు దృఢమవుతాయి.నీరసం, అలసట తగ్గుతాయి. మానసిక ఉల్లాసం కలుగుతుంది.

ప్రికాషన్స్..

– ఫుల్లుగా తిని వాకింగ్ చేయడం మంచిది కాదు

– రెండు మూడ్రోజులు నడిచి మానేయడం కంటే డైలీ వాకింగ్ చేస్తేనే ప్రయోజనం

– వాకింగ్ ఆపేసిన మళ్​లీ ప్రారంభించాలంటే నెమ్మదిగా స్టార్ట్ చేయాలి

– డైలీ అరంగట వాకింగ్ కు టైమ్ కేటాయించాలి

– తక్కువ దూరంతో వాకింగ్ స్టార్ట్ చేసి రోజురోజుకు పెంచుకుంటూ వెళ్లాలి

Tags

Next Story