చాలా మంది బాత్రూమ్‌లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?

చాలా మంది బాత్రూమ్‌లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?
మరణం మన చేతిల్లో లేదు. అది మనం పుట్టినప్పుడే రాసేసి ఉంటుందని అంటారు. అలా అని ఊరుకోలేం. మన ప్రయత్నం మనం చేస్తాం.

మరణం మన చేతిల్లో లేదు. అది మనం పుట్టినప్పుడే రాసేసి ఉంటుందని అంటారు. అలా అని ఊరుకోలేం. మన ప్రయత్నం మనం చేస్తాం. ఆ తరువాత దైవాదీనం. ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఏదైనా వచ్చినప్పుడు దేవుడిమీద భారం వేయడం అంటే గాల్లో దీపం పెట్టడం లాంటిదే. మరి మనకి తెలిసిన చిన్న చిన్న చిట్కాలు, డాక్టర్ చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే కలకాలం కాకపోయినా బ్రతికినన్నాళ్లు అనారోగ్యం బారిన పడకుండా ఉంటామేమో.. చాలా మంది తెల్లవారు ఝామున బ్రాతూమ్‌కి వెళ్లి అక్కడే ప్రాణాలు విడిచిన సంఘటనలు వింటూవుంటాము.

అర్జంట్‌గా వచ్చిందాకా ఆగకుండా.. లేచిన వెంటనే పరిగెట్టకుండా.. మెలకువ రాగానే లేవకుండా.. ఓ అరనిమిషం అలాగే ఉండాలి. ఆ తరువాత మరో రెండున్నర నిమిషాలు లేచి బెడ్ మీదే కూర్చొని కాళ్లు క్రిందికి పెట్టి ఉంచాలి. ఇప్పుడు లేచి బాత్రూమ్‌కి వెళ్లాలి. ఇలా మూడునిమిషాలు చేస్తే ముంచుకొచ్చే మృత్యువునుంచి కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేసుకోవచ్చంటున్నారు హృదయ సంబంధిత నిపుణులు. ఎందుకంటే లేచిన వెంటనే బాత్రూమ్‌కి వెళితే మెదడుకు రక్తప్రసరణ లోపించి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది.

కాబట్టి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఈ చిన్న చిట్కా పాటిస్తే గుండె పది కాలల పాటు పదిలంగా ఉంటుంది. విషయం మంచిదే, పైగా ఖర్చులేని పని. తెలిసిన వారందరికీ చెబితే ఓ మంచి విషయం చెప్పినందుకు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారేమో.

Tags

Read MoreRead Less
Next Story