Health Risks : రోజూ డ్రింక్స్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ ముప్పు

రోజూ కనీసం ఒక డ్రింక్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు ఐదింతలు ఎక్కువని USలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్’ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘డ్రింక్స్ తాగే యువతుల్లో ధూమ, మద్యపాన అలవాట్లు లేకపోయినా నోటి క్యాన్సర్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 3.55 లక్షలమందికి నోటి క్యాన్సర్ సోకింది. వీరిలో ఎక్కువగా యువతులే ఉండటం ఆందోళనకరం’ అని తమ నివేదికలో వారు తెలిపారు.
ఇక పెళ్లికి ముందుతో పోలిస్తే తర్వాతే మగవాళ్లు లావెక్కుతారని పొలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు తేల్చారు. మహిళల్లో ఇది 39 శాతమే ఉంటుందని చెప్పారు. సింగిల్స్‌తో పోలిస్తే పెళ్లయిన పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రెట్లు పెంచుతుందని అధ్యయనంలో తెలిపారు. తినే ఆహార పరిమాణం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కారణాలుగా అభిప్రాయపడ్డారు.
మనిషికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక నిద్రలేమికి సంకేతమని చెబుతున్నారు. నిద్రలేమితో కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సరైన నిద్ర ఉంటే 30-60% రోగుల్లో ఆల్జీమర్స్, గుండె జబ్బులు తగ్గుతున్నాయని తెలిపారు. ఏకధాటిగా 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com