మహారాష్ట్రలో కరోనా కాటుకి బలౌతున్న వైద్యులు

X
By - Admin |30 Aug 2020 1:29 PM IST
కరోనాతో ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులను ఈ మహమ్మారి టార్గెట్ చేస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పోలీసులు, వైద్యులు ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. మహారాష్ట్రలో ఒక్కరోజే ముగ్గురు వైద్యులు వేర్వేరు ప్రాంతాల్లో కరోనా కాటుకి బలైయ్యారు. అకోలా, బుల్ధనా, భూసావల్ జిల్లాలకు చెందిన ఈ వైద్యులు కరోనాతో మృతి చెందారు. అకోలా జిల్లాకు చెందిన డాక్టర్ వివేక్ ఫడ్కే, బుల్ధానా జిల్లాకు చెందిన డాక్టర్ గోపాల్, క్షీరసాగర్ భూసావల్ జిల్లాకు చెందిన వైద్యుడు ఉమేష్ మనోహర్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 7 లక్షల 64 వేల 281 కరోనా కేసులు నమోదయ్యాయి. అటు, 292 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనాతో మృతిచెందగా.. 26 మంది వైద్యులు మరణించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com