ఉత్తరాదిన భూప్రకంపనలు.. భయంతో ప్రజల పరుగులు

ఉత్తరాదిన భూప్రకంపనలు.. భయంతో ప్రజల పరుగులు
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లో భూప్రకంపనలు

ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌లో భూప్రకంపనలు ఏర్పాడ్డాయి. ఢిల్లీ, నోయిడా సహా పలు నగరాల్లో భూమి కంపించింది. దీంతో పలు చోట్ల పాక్షికంగా భవనాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో నోయిడాలోని ఇళ్లలో సమాన్లు కిందపడ్డాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లోను పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఇస్లామాబాద్‌, లాహోర్‌, పెషావర్‌లో భూమి కంపింది. భూకంప తీవ్రత రెక్టర్‌స్కేల్‌పై 6.5గా నమోదయింది.

Tags

Next Story