తెలుగు రాష్ట్రాల్లో పసుపు పండగ షురూ.. నాంపల్లి గ్రౌండ్స్‌లో ఆవిర్భావ సభ

తెలుగు రాష్ట్రాల్లో పసుపు పండగ షురూ.. నాంపల్లి గ్రౌండ్స్‌లో  ఆవిర్భావ సభ
41వ ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలని టీడీపీ జాతీయ నాయకత్వం నిర్ణయం

తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటి సరిగ్గా 41 ఏళ్లు పూర్తి అయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పసుపు పండగ మొదలైంది. ఆవిర్భావ దినొత్సవాన్ని హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు సభ ప్రారంభం కానుంది. 41వ ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించాలని టీడీపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 15వేల మంది ప్రతినిధులు సభకు హాజరుకానున్నారు.

సభను విజయవంతం చేసేందుకుగాను పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. వేదిక వద్ద ఎల్‌ఈడీ తెరలు, నగరమంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయలుదేరి ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి నివాళులర్పిస్తారు. 4 గంటలకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 41వ ఆవిర్భావ వేడుక సందర్భంగా కేక్‌ కట్‌ చేయనున్నారు. అమరులైన కార్యకర్తలకు ముందుగా నివాళులర్పిస్తారు. ఇక హైదరాబాద్‌లో ఆవిర్భావ వేడుకలు జరుగుతుండటంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నెలకొంది.

Tags

Next Story