మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్న కరోనా మహ్మారి

మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్న కరోనా మహ్మారి
24 గంటల వ్యవధిలో అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేల 16కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

దేశంలో కరోనా మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేల 16కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న లక్షా 10 వేల 522 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. దాదాపు ఆరు నెలల తర్వాత ఈస్థాయి పెరుగుదల కనిపించింది. ముందురోజు ఈ కేసుల సంఖ్య 2 వేల 151గా ఉంది. మరోవైపు ఢిల్లీని కోవిడ్‌ అల్లాడిస్తోంది. ఢిల్లీలో తాజగా కరోనాతో ఇద్దరు మృతి చెందగా కొత్తగా 300 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు13.89 శాతానికి చేరింది. తెలంగాణలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఆరుగురికి వైరస్ సోకింది.

కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 13 వేల 509 కి చేరాయి. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతానికి చేరడం కలవరానికి గురిచేస్తోంది. కేంద్రం కొత్తగా 14 మరణాలను ప్రకటించింది. అందులో కేరళ నుంచి ఎనిమిది మరణాలు వచ్చాయి. అవి సవరించిన గణాంకాలు. ఇక 2021 నుంచి 220.65 కోట్ల టీకా డోసులు పంపిణీ అయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కోవిడ్‌ ప్రకంపనలతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలు… కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్‌ ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్‌కి అవసరమైన మందులు, వైద్యపరికరాలను సమకూర్చుకోవాల్సిందిగా సూచింది. ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు, నర్సులు, ఇతర వనరులను కూడా సమకూర్చుకోవాలని చెప్పింది. కేంద్రం ఆదేశాలతో అన్ని రాష్ట్రాలు అప్రమ్తతం అయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story