దేశవ్యాప్తంగా పెరగుతున్న ఎండలు.. బయటకు వెళ్లకపోవడమే బెటర్‌..!

దేశవ్యాప్తంగా పెరగుతున్న ఎండలు.. బయటకు వెళ్లకపోవడమే బెటర్‌..!
ఐదురోజుల పాటు ఉష్ణోగ్రతుల పెరుగుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ అధికారుల సూచన

దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఐదురోజుల పాటు ఉష్ణోగ్రతుల పెరుగుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే ఉత్తమమని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు వెల్లడించారు. .

ఏప్రిల్‌- జూన్‌ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణభారతదేశంలో ఎండలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదవుతాయని ఇటీవలే భారత వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, పశ్చిమ్‌బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. వేడిగాలులు తీవ్రత అధికంగా ఉండొచ్చంటున్నారు ఐఎండీ అధికారులు. అయితే.. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

Tags

Next Story