అమ్మాయిలు ఫోన్‌లు ఎంతసేపు వాడుతున్నారంటే!

మొబైల్ వినియోగంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు వెనుకబడి ఉన్నారని ఓ సర్వేలో తేలింది. దేశంలో 42% మంది టీనేజీ అమ్మాయిలకు రోజులో కేవలం ఒక గంట మాత్రమే మొబైల్ చూసేందుకు తల్లిదండ్రులు అనుమతిస్తున్నారని తెలిపింది.
కర్ణాటకలో ఎక్కువ మంది అమ్మాయిలు ఫోన్లు వాడుతుంటే హర్యానాలో అతి తక్కువ మంది ఫోన్ వాడుతున్నారని తేలింది. ఫోన్ల వల్ల ఆడపిల్లలు దారితప్పుతారని తల్లిదండ్రులు భయపడుతున్నారని సర్వేలో వెల్లడైంది.
ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ క్యాటలైజింగ్ ఛేంజ్ (సీ3) అనే ఎన్జీవో.. డిజిటల్ ఎమ్‌పవర్‌మెంట్ ఫౌండేషన్ (డీఈఎఫ్)తో కలసి ఈ స్టడీని చేపట్టింది. అస్సాం, హరియాణా, కర్నాటక, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్‌లో ఈ సర్వే నిర్వహించారు.
కాగా, కౌమార దశలో ఉన్న అమ్మాయిలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అందరి దృష్టికి తీసుకొచ్చి.. వాటిని పరిష్కరించడమే ఈ సర్వే ఉద్దేశమని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com